Ad Code

క్రానిక్ ఇన్ఫ్లమేషన్ - లక్షణాలు - జాగ్రత్తలు


క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది అక్యూట్ ఇన్ఫ్లమేషన్ (తక్షణ మంట) లాగా స్పష్టంగా నొప్పి లేదా వాపు రూపంలో కనిపించదు. దీని లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి అందువల్లే చాలామంది గుర్తించలేరు. తరచుగా విపరీతమైన అలసటగా నీరసంగా అనిపించడం చిన్నపాటి పని చేసినా త్వరగా అలిసిపోవడం దీని ప్రధాన లక్షణం కావచ్చు. తరచుగా వచ్చే కడుపు ఉబ్బరం అజీర్తి లేదా జీర్ణ సమస్యలు, శరీరంలో ఎప్పుడూ ఒక చిన్న నొప్పి లేదా నొక్కుకుపోయిన భావన ఉండటం, ముఖం లేదా చర్మం ఎప్పుడూ ఎర్రగా లేదా పొడిబారినట్లు ఉండటం, అర్థం కాని చర్మ సమస్యలు రావడం, అకారణంగా బరువు పెరగడం లేదా తగ్గడం, ఏకాగ్రత లోపించడం లేదా ‘బ్రెయిన్ ఫాగ్’  వంటివి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లుగా సూచిస్తాయి. ఈ అంతర్గత మంటను తగ్గించడానికి మనం జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. ప్రధానంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను పూర్తిగా తగ్గించాలి. వాటికి బదులుగా యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, చేపలు నట్స్, ఆలివ్ నూనె వంటివి యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. రోజువారీ జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం రోజుకు 7-8 గంటలు నిద్ర పోవడం వల్ల కూడా శరీరం రిపేర్ అయ్యి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

Post a Comment

0 Comments

Close Menu