పోర్స్చే 911 టర్బో ఎస్‌ కారు విడుదల

Saturday, November 15, 2025

automobile car was launched at the IAA Mobility 2025 in Munich Germany Porsche 911 Turbo S launched science technology this car is the most powerful 911 model and has a T-hybrid system

t f B! P L


దేశీయ మార్కెట్లో అప్‌డేట్‌ చేసిన పోర్స్చే 911 టర్బో ఎస్‌ కారును విడుదల చేశారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన IAA మొబిలిటీ 2025లో ఈ కారును ప్రారంభించారు. ఈ కారు పోర్స్ అత్యంత శక్తివంతమైన 911 మోడల్ అని, T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉందని పోర్స్చే యాజమాన్యం వెల్లడించింది. ఈ కారును కొద్ది నెలల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా లాంఛ్ చేశారు. ఇండియాలో ఈ రెండు-డోర్ల కూపే ఎక్స్-షోరూమ్ ధర 3.80 కోట్ల రూపాయలుగా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఇది విలాసవంతమైన అనుభూతి, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందినదిగా కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. పోర్స్చే కొత్త కారు క్యాబిన్ టర్బోక్‌నైట్ ఇంటీరియర్ ట్రిమ్‌తో వస్తుంది. ఈ కారులో GT స్పోర్ట్ స్టీరింగ్ వీల్ కూడా ఉందని కంపెనీ సిబ్బంది తెలిపారు. అయితే. డ్యాష్‌బోర్డ్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ ,అనలాగ్ క్లాక్ ఉన్నాయన్నారు. ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్పోర్ట్ సీట్లు ఉండడం విశేషం. పోర్షే 911 టర్బో ఎస్ కారులో 3.6-లీటర్ ఫ్లాట్-సిక్స్ హైబ్రిడ్ ఇంజిన్, టి-హైబ్రిడ్ సిస్టమ్ తో కలిపి ఉంటుందన్నారు. ఈ కారులోని అదనపు టర్బోచార్జర్ 711 బిహెచ్‌పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ఎక్స్ పర్ట్స్ తెలిపారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ