Ad Code

డిసెంబర్ 4 సభ కోసం టీవీకే అధినేత విజయ్‌ సమర్పించిన దరఖాస్తు తిరస్కరించిన పోలీసులు



మిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్‌ కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సేలంలో డిసెంబర్ 4న జరగాల్సిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. భద్రతా కారణాల వల్ల ఆ తేదీల్లో అనుమతి ఇవ్వలేమని పోలీసులు మొదట తెలిపారు. కానీ తమిళగ వెట్రి కజగం పార్టీకి ఇచ్చిన లేఖలో మాత్రం ​భద్రతా సిబ్బంది లేకపోవడం, ఎంత మంది ప్రజలు హాజరవుతారనే కచ్చితమైన వివరాలు ఇవ్వకపోవడం వంటి అంశాలను అనుమతి నిరాకరించడానికి కారణాలుగా చూపారు. అలాగే భవిష్యత్తులో విజయ్ ప్రజా సమావేశాలకు అనుమతి కోరినట్లయితే నిర్వహించే కార్యక్రమం తేదీకి కనీసం నాలుగు వారాల ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈక్రమంలో టీవీకే పార్జీ తమ ప్రచారాన్ని ప్రత్యామ్నాయ తేదీల్లో నిర్వహించుకునేందుకు త్వరలోనే అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. సేలం తర్వాత పార్టీ అధినేత విజయ్ ప్రచారాన్ని ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో నిర్వహించాలని పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu