Ad Code

అక్టోబర్లో 40 టెస్లా కార్లు అమ్మకం


దేశీయ మార్కెట్లో టెస్లా పూర్తిగా దిగుమతులపై ఆధారపడి అమ్మకాలు చేస్తుంది. ఈ ఏడాది మధ్యలో మోడల్ Y ద్వారా భారత్ లోకి ప్రవేశించిన ఈ కంపెనీ, అక్టోబర్‌లో కేవలం 40 కార్లే సేల్ చేసింది. ప్రస్తుతం టెస్లా ఒక్క మోడల్ Y కారునే విక్రయిస్తుండగా, దీని ధర రూ.59.89 నుంచి రూ.67.89 లక్షలుగా ఉంది. టెస్లా ఇంకా లోకల్‌గా అసెంబ్లింగ్‌ని స్టార్ట్ చేయకపోవడం, కంపెనీ స్టోర్లు కూడా ముంబై, ఢిల్లీలకే పరిమితం కావడంతో, విన్‌ఫాస్ట్ లాగా స్పీడ్ గా విస్తరించలేకపోయింది. టెస్లా కార్ల దిగుమతుల ద్వారా మాత్రమే విక్రయాలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. జీఎస్‌టీ మార్పులతో పెట్రోల్‌, డీజిల్ వాహనాలపై పన్ను తగ్గించినప్పటికీ, ఈవీలపై 5 శాతం సుంకం కొనసాగుతోంది. దీంతో జీఎస్‌టీ 2.0 ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపుపై చూపించలేదు. మరోవైపు హ్యుందాయ్, మారుతి, కియా, జేఎస్‌డబ్ల్యూ లాంటి సంస్థలు కూడా లోకల్‌గా ఈవీ అమ్మకాలను పెంచేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu