Ad Code

నేటి నుంచే రూ.35,100 విలువైన 'జెమినీ ప్రో' ఫ్రీ ప్లాన్‌ అమలు !


రిలయన్స్‌ జియో ఇప్పటికే అనౌన్స్ చేసిన విధంగా గూగుల్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ 'జెమినీ ప్రో' ప్లాన్‌ను నేటి నుంచి పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. రూ.35,100 విలువైన ఈ ప్లాన్‌ను జియో 5జీ వినియోగదారులు 18 నెలల పాటు ఏ రూపాయి ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా మై జియో యాప్‌లో "Claim Now" బ్యానర్‌పై క్లిక్ చేస్తే వెంటనే ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఆఫర్‌ను ప్రధానంగా రెండు గ్రూపులు పొందగలవు. వీటిలో ఒకటి.. అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్న జియో యూజర్లు. కనీసం రూ.349 విలువైన 5జీ అన్‌లిమిటెడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. రెండోదిగా.. 18-25 ఏళ్ల మధ్య వయస్సున్న యూత్ (ఇప్పటి వరకూ ఈ గ్రూప్‌కే ప్రత్యేక ఆఫర్ ఉండేది). ఇప్పుడు ఈ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అర్హత కలిగిన జియో 5జీ యూజర్లకు విస్తరించారు.

Post a Comment

0 Comments

Close Menu