Ad Code

మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి ఆత్మహత్య


ధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం తన నివాసంలో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గుర్తించిన రోహిణి సోదరి రోషిణి వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టిఫిన్‌ చేసిన తర్వాత ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఆ తర్వాత గదిలోకి వెళ్లిందని చెప్పారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా గదిలో ఉరేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే, వర్క్‌ప్లేస్‌లో వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి.. అష్టాలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu