Ad Code

నకిలీ ఐఫోన్లు గుర్తించడమెలా ?


యాపిల్ ఐఫోన్లు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ యాపిల్ స్టైలిష్ డిజైన్, హై లెవల్ సెక్యూరిటీ కారణంగా ఐఫోన్లను ఇష్టపడతారు. అయితే చాలా చోట్ల యాపిల్ ఐఫోన్ డూప్లికేట్ మోడల్స్ విక్రయిస్తున్నారు. 2024 నివేదిక ప్రకారం యాపిల్ కేవలం ఐఫోన్ల విక్రయం ద్వారా 39 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఐఫోన్లకు ఉన్న ఆదరణ కారణంగా మార్కెట్ ఇప్పుడు నకిలీ ఐఫోన్లతో నిండిపోయింది. వీటి కారణంగా నగదు చెల్లించి కూడా చాలా మంది మోసపోతున్నారు. ఒరిజినల్ ఐఫోన్ ప్యాకేజింగ్ అధిక నాణ్యతతో ఉంటుంది. బాక్స్పై ప్రొడక్ట్ కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఉంది. దీంతో పాటు బార్కోడ్, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీని ద్వారా ఫోన్ ఒరిజినల్ నా, కాదా అనేది చెక్ చేయవచ్చు. బాక్స్ పై బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ లేకపోతే ఫోన్ నకిలీది కావచ్చు. ఐఫోన్ సీరియల్ నంబర్, ఐఎంఈఐ నంబర్ను చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం. ముందుగా ఐఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ జనరల్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని అందులో అబౌట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ సీరియల్ నంబర్ కనిపిస్తుంది. దీన్ని యాపిల్ చెక్ కవరేజ్ లో రిజిస్టర్ చేయాలి. ఫోన్ లో *#06# డయల్ చేసి బాక్స్ పై వ్రాసిన ఐఎంఈఐ నంబర్తో దాన్ని మ్యాచ్ చేయండి. ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో జనరల్ పై క్లిక్ చేయాలి. అందులో సాఫ్ట్ వేర్ అప్డేట్ సెక్షన్ కి వెళ్లాక ఐవోఎస్ అప్డేట్ ను చెక్ చేయాలి. అలాగే సిరికి "హే సిరి" కమాండ్ ఇవ్వండి. సిరి రెస్పాండ్ అయితే ఫోన్ నిజమైందని చెప్పవచ్చు. ఐఫోన్ లో యాప్ స్టోర్ మాత్రమే ఉంటుంది. ఫోన్ యాప్ స్టోర్ కు సపోర్ట్ చేయకపోతే అది ఫేక్ అవ్వచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu