Ad Code

రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ గుండె పోటుతో బాలుడు మృతి !


త్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాలుడు మొదట్లో తన స్నేహితుడితో కలిసి రెండు రౌండ్లు పరిగెత్తాడు, ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలాడు. పిల్లాడిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో డిసెంబర్ 07న జరగాల్సిన క్రీడా పోటీల కోసం బాలుడు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం నెలకొంది. 

Post a Comment

0 Comments

Close Menu