దేశీయ మార్కెట్లోకి రెనాల్ట్ డస్టర్ మరోసారి ఎంట్రీ చేసే అవకాశం కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన కార్యక్రమంలో డస్టర్ రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. వచ్చే మార్చిలో దక్షిణాఫ్రికాలో మొదట విడుదల చేస్తుంది. రెనాల్ట్ డస్టర్ తొలిసారిగా 2012లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పట్లో ఈ ఎస్‌యూవీకి వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించింది. కానీ కొత్త ఉద్గార నిబంధనలను పాటించకపోవడం, పెరుగుతున్న పోటీ కారణంగా క్రమంగా దాని అమ్మకాలు క్షీణించడం ప్రారంభించాయి. చివరికి రెనాల్ట్ 2022లో దేశంలో డస్టర్ ఉత్పత్తిని నిలిపివేసింది. కొత్త డస్టర్‌కి పవర్‌గా మూడు ఇంజన్లు ఉంటాయి. ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, 1.6-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఉన్నాయి. ఇది కాకుండా, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా ఇందులో అందుబాటులో ఉండవచ్చు.చూడడానికి రిచ్ లుక్ ఇస్తూ కనిపిస్తుంది. అయితే హెడ్‌ల్యాంప్‌లు, క్లాడింగ్, సైడ్ సిల్హౌట్, టెయిల్ ల్యాంప్స్ వంటి మిగిలిన స్టైలింగ్‌లో ఎటువంటి మార్పు లేయలేదని అనిపిస్తుంది. కొత్త తరం డస్టర్ రైట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌లో గ్లోబల్ మోడల్ ఫీచర్లు ఉన్నాయి. వచ్చే ఏడాది భారతదేశంలో అధికారికంగా వెల్లడి చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
0 Comments