ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా మొదటి రెండు నెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్లీ ఇచ్చే వారు కాదు. ఏ కారణం చేతనైనా పింఛనుదారుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే రెండవ నెలలో బకాయితో పాటు పింఛన్ అందించనున్నారు.
0 Comments