టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబర్ 22 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి సిరీస్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు బోర్డుకు తెలియజేశాడు. దీంతో రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. రోహిత్ శర్మ దూరం కావడంతో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌కి ముందు రోహిత్ టీమిండియాలో చేరతాడు. అతను రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే ఈ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 4-1 తేడాతో విజయం సాధించాలి. అందుకే, బుమ్రా కెప్టెన్సీ పెర్త్‌లో ఈ టెస్ట్ పెద్ద 'పరీక్ష' కానుంది.
0 Comments