Ad Code

నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తా : సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ పై జరుగుతున్న దుష్ప్రచారం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu