Ad Code

థెర్మో ఎలక్ట్రిక్‌ టెక్స్‌టైల్స్‌ సాంకేతిక ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తు ఉత్పత్తి !


థెర్మో ఎలక్ట్రిక్‌ టెక్స్‌టైల్స్‌ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్‌ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్‌ దారాలకు కండక్టివ్‌ ప్లాస్టిక్‌ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్‌ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్‌టైల్‌ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్‌ టెక్స్‌టైల్స్‌ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్‌ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu