Ad Code

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు !


ఆంధ్రప్రదేశ్ లోని బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ శాసన సభలో ప్రతిపాదన చేశారు. పెట్టుబడులు, మౌళిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసన సభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించారన్నారు. చింతగొంది, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ల పై దాడి చేసి బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారని తెలిపారు. మన్యం వీరుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన 125 జయంతిని పురస్కరించుకొని కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారని గుర్తు చేశారు.దేశం కోసం పోరాడిన వీరుడిని గుర్తు చేసుకోవడం అవసరమని వెల్లడించారు. గత ఐదేళ్ల పాటు భోగాపురం ఎయిర్ పోర్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఏజెన్సీలో పోరాటం చేసిన అల్లూరి సీతారామ రాజు పేరును విమానశ్రయానికి పెట్టాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని సీఎం తెలిపారు. ఆయన స్మారక మ్యూజియం ను కూడా నిర్మించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విప్లవ వీరుడి విగ్రహం పార్లమెంట్ లో కూడా ఉండాలని ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments

Close Menu