Ad Code

సోలార్ పవర్ ప్లాంట్ పనులను స్థానికులను కాదని వేరే కంపెనీకి ఎలా అప్పగిస్తారు అంటూ ఆందోళన !


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం మండలం దొబ్బుడుపల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పనులను మరో సంస్థకు అదానీ కంపెనీ అప్పగించింది. అయితే స్థానికులను కాదని వేరే కంపెనీకి పనులు ఎలా అప్పగిస్తారు అంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇదే సోలార్ పవర్ ప్లాంట్ వద్ద మట్టి తోలే అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో మరోమారు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu