Ad Code

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ !


కార్తీక సోమవారం కావడంతో తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈరోజు శ్రీవారి దర్శనం సులువుగా భక్తులకు లభిస్తుంది. కార్తీక సోమవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు శైవక్షేత్రాలకు వెళ్లేందుకు సుముఖత చూపుతారు. అందుకే తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. కార్తీక మాసంలోనూ శుక్ర, శని, ఆదివారాలు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు కేవలం రెండు గంటల్లోనే దర్శనం అవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,441 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,595 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu