Ad Code

మూడో టెస్ట్‌లో గెలుపు దిశలో టీమిండియా ?


ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా విజయంపై కన్నేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 263 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌పై స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు చివరి బ్యాటర్‌ను కూడా త్వరగా అవుట్ చేసి 150 లోపు లక్ష్యం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే వాంఖడేలో నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ అంత సులభం కాదు. ఇప్పటివరకు వాంఖడేలో అత్యధిక ఛేజింగ్ 163 పరుగులు మాత్రమే. ఆ రికార్డు కూడా దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2000లో భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 63 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగే 1980లో భారత్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఇక, ఇదే వేదికలో 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో ఛేదించింది. ఏదేమైనా న్యూజిలాండ్‌ను 180 పరుగుల లోపు ఆలౌట్ చేసి.. టీమిండియా బ్యాటర్లు నెమ్మదిగా వికెట్లు కాపాడుకుంటూ ఆడితేనే విజయం సాధ్యమవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu