టీవీఎస్ మోటార్ కి చెందిన అపాచీ ఆర్టీఆర్ 160 4V కొత్త ఫీచర్లతో విడుదలైంది. దీనికి గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ అమర్చారు. దీనిలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది. అంతేకాకుండా బ్లూటూత్ కనెక్టివిటీని అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS వార్నింగ్, వాయిస్ సహాయాన్ని అందిస్తుంది. ఈ బైకులో గ్లైడ్ త్రూ టెక్నాలజీ కూడా ఉంది. ఇది గ్రానైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి రంగులలో వచ్చింది. ఇంతకు ముందు లైట్నింగ్ బ్లూ ఉండేది. ఈ బైక్ స్పోర్టీ, రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, గోల్డెన్-ఫినిష్ USD ఫోర్క్స్, రెడ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V బైక్ 160 cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 17.3 bhp శక్తిని, 6,500 rpm వద్ద 14.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 114 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. రైడ్ మోడ్ల గురించి మాట్లాడుతూ.. అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో స్పోర్ట్, అర్బన్, రెయిన్ సహా మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. ఈ బైకుకు 37mm USD ఫ్రంట్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABS, 240 mm వెనుక డిస్క్ బ్రేకింగ్ కలిగి ఉంది.
0 Comments