అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోంది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్‌క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై 2026 ఏప్రిల్‌లో ముగుస్తుంది.
0 Comments