ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో రూ. 2,745.7 కోట్ల లాభాన్ని అందుకుంది. అదే కంపెనీ 2022-23 సంవత్సరంలో రూ. 2,229.6 కోట్ల లాభం ఇచ్చింది. ఈ ఏడాదితో పోలిస్తే ఇది 23% అధిక లాభాల్ని అందించింది. అయితే ఇది గత ఏడాది మొత్తం ఆదాయం రూ. 49,321.8 కోట్ల నుంచి 36% పెరిగి రూ.67,121.6 కోట్లకు చేరింది. ఈ కంపెనీ 2023-24లో మొత్తం వ్యయం చూస్తే రూ. 63,397 కోట్లుగా నమోదైంది. ప్రముఖ యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్లే కాకుండా లాప్‌టాప్‌లు, యాపిల్ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్‌లు అమ్మకాలు చేస్తుంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో యాపిల్ శామ్‌సంగ్ తర్వాత 21.6% మార్కెట్ వాల్యూని కలిగి ఉంది. 35,002 ఫుల్లీ పెయిడెడ్ ఈక్విటీ షేర్లలో ఒక్కోదానికి రూ. 9.43 లక్షల డివిడెండ్‌ను సరఫరా చేసింది. అదే విలువ రూ. 3,302 కోట్లుగా మారింది. అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ బ్రాండ్ ఫోన్ల విలువ భారత్‌లో 15% తగ్గి రూ. 3,083.45 కోట్లకు చేరుకుంది. 2022-23 లో ఇది 3643.62 కోట్లుగా ఉంది.
0 Comments