మెటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) రూ.213.1 కోట్ల జరిమానా విధించింది. 2021లో వాట్సాప్‌ల గోప్యతా విధానాన్ని అమలు చేయడానికి మెటా తన 'ఆధిపత్య స్థానాన్ని' దుర్వినియోగం చేసిందని సిసిఐ తెలిపింది. కొన్ని ప్రవర్తనా సంస్కరణలను అమలు చేయాలని సిసిఐ మెటాను ఆదేశించింది. వినియోగదారుల డేటా కార్యకలాపాలను మిస్ యూజ్‌ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లు కలిసి భారతదేశంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్నారు. వాట్సాప్‌కు దేశంలో 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. కాబట్టి తమ దేశ పౌరుల ప్రైవసీ భద్రత ముఖ్యమని చెబుతోంది. సిసిఐ తన ప్లాట్‌ఫారమ్‌లో సేకరించిన వినియోగదారు డేటాను ఇతర మెటా కంపెనీలు లేదా కంపెనీ ఉత్పత్తులతో ప్రకటనల ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాల పాటు పంచుకోవద్దని వాట్సాప్‌ను ఆదేశించింది.ప్రకటనలు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం, ఇతర మెటా కంపెనీలు లేదా కంపెనీ ఉత్పత్తులతో ఏ యూజర్ డేటా షేర్ చేయబడుతుందో వాట్సాప్ విధానం స్పష్టంగా పేర్కొనాలని సిసిఐ తెలిపింది. డేటా షేరింగ్ ఉద్దేశ్యం కూడా ఈ వివరణలో స్పష్టంగా పేర్కొనబడాలి అని తెలిపింది. కానీ మెటా ఏ నిబంధనలను పాటించలేదని తెలుస్తుంది. వాట్సాప్‌ను వినియోగదారులకు ఉచితంగా ఇచ్చి మోసం చేస్తుందని చాలా ఏళ్లుగా ఈ కంపెనీపై అనుమానాలు ఉన్నాయి. మోటా అల్గారిథమ్‌ని ఉపయోగించి మన గోప్యతకు భంగం కలిగిస్తుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
0 Comments