బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వాళ్లమని పేర్కొన్నట్లు పోలీస్ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు కొన్ని నెలలుగా ప్రణాళికలు రచించారని.. ఆయనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ .. సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని తెలిపారు. ఈ హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ. 50,00 అడ్వాన్స్, మారణాయుధాలు ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టారు. తాజా ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
0 Comments