హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లాట్‌లకు డిమాండ్ పెరగుతుందని హోం బయ్యార్ సెంటిమెంట్ సర్వే పేర్కొంది. నగరంలోని దక్షిణ ప్రాంతాలలో అత్యల్ప ప్రాపర్టీ ధరలు ఉన్నట్లు హోం బయ్యార్ సెంటిమెంట్ సర్వే - H1 2024 ప్రకారం తెలిస్తోంది. దక్షిణ హైదరాబాద్‌లో 2BHK ఫ్లాట్‌ల సగటు బడ్జెట్ పరిధి రూ. 45 లక్షల నుంచి 55 లక్షలు, సగటు చదరపు అడుగు ధర రూ. 5,720గా ఉంది. నగరంలోని మధ్య ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు అత్యధికంగా ఉన్నాయి.సెంట్రల్ హైదరాబాద్ లో డబుల్ బెట్ రూమ్ కు సగటున రూ.కోటి నుంచి రూ.కోటి 50 లక్షల ఉంది. ఇక్కడ సగటు చదరపు అడుగు ధర రూ. 9,450గా ఉంది. తూర్పు హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ రూ.55 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంది. ఇక్కడ సగటు చదరపు అడుగు ధర రూ.5,850గా ఉంది. ఉత్తర హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం రూ.55 లక్షల నుంచి 65 లక్షల వరకు ఉంది. ఇక్కడ సగటు చదరపు అడుగు ధర రూ.5,945 గా ఉంది. పశ్చిమ హైదరాబాద్ లో రూ.65 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉంది. ఇక్కడ సగటు చదరపు అడుగు ధర రూ.7,765గా గా ఉంది. జీహెచ్‌ఎంసీ ప్రకారం మలక్‌పేట, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రాపర్టీ ధరలతో పాటు, 3BHK యూనిట్ల డిమాండ్ హైదరాబాద్‌లో అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయని తెలిపింది. భారతదేశంలో రెండేళ్ల క్రితం (H1 2022) నిర్వహించిన సర్వేతో పోలిస్తే, 3BHK యూనిట్లపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లో 27 శాతం మంది కొనుగోలుదారులు రెసిడెన్షియల్ ప్లాట్‌లను ఇష్టపడుతున్నారని నివేదిక పేర్కొంది. అదేవిధంగా హైదరాబాద్‌లో విల్లాలు, రో హౌస్‌లకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. అయినప్పటికీ, అపార్ట్‌మెంట్లు కొనుగోలుదారుల ప్రాధాన్యతలను ఆధిపత్యం చేస్తూనే ఉన్నాయి. అయితే రియాల్ ఎస్టేట్ వారు కావాలని ఇలా నివేదికలు ఇప్పిస్తుంటారని.. వారి బిజినెస్ పెరిగేందుకు ఇలా చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో అనుకున్నంత డిమాండ్ ఏం లేదని చెబుతున్నారు.
0 Comments