Ad Code

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో వివాన్ కపూర్‌కు రజతం !


ఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత షూటర్‌ వివాన్ కపూర్ సత్తాచాటాడు. గురువారం అతడు పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. అంతకుముందు మరో భారత షూటర్ అనంత్‌జిత్ సింగ్ నరుకా పురుషుల స్కీట్‌ విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది. ఫైనల్‌లో వివాన్ 44 స్కోరు చేసి రెండో స్థానంలో నిలవగా, యింగ్ క్వి (చైనా) స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తుర్కియేకి చెందిన టోల్గా ఎన్ టన్సర్ 35 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. స్కీట్ ఫైనల్‌లో అనంత్‌జిత్‌ సింగ్ 43 స్కోరు సాధించి కాంస్యం అందుకున్నాడు. ఇటలీకి చెందిన తమ్మరో కసాండ్రో (ఇటలీ) 57 స్కోరుతో స్వర్ణం, గాబ్రియెల్ రోసెట్టి 56 స్కోరుతో రజత పతకాలను సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సోనమ్ మస్కర్ రజతం గెలుచుకోగా, బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో అఖిల్ షెరాన్ కాంస్యం సాధించాడు.పారిస్ ఒలింపిక్స్‌లో స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అనంత్‌జిత్ సింగ్ నరుకా, మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక పోరులో చైనా చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu