Ad Code

శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య !


శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య ఆ దేశ జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చిందని వెల్లడించింది. రెండు సంవత్సరాల పాటు సనత్ జయసూర్య ఈ పదవిలో కొనసాగుతారు. 2026 మార్చి 31వ తేదీ వరకు ఆయన జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆ తరువాత జట్టు ప్రదర్శన ఆధారంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించాలా? వద్దా? అనేది బోర్డు నిర్ణయిస్తుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ పూర్తయ్యేంత వరకూ ఇదే హోదాలో ఉంటారు. ప్రస్తుత సనత్ జయసూర్య శ్రీలంక జాతీయ జట్టుకు తాత్కాలికంగా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఏడాది జూలైలో ఆయన అపాయింట్ అయ్యారు. హెడ్ కోచ్‌గా జయసూర్య సారథ్యంలో శ్రీలంక క్రికెట్ టీమ్ కొన్ని అద్భుతాలను సృష్టించింది.


Post a Comment

0 Comments

Close Menu