హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే ఫ్యాషన్ డిజైనర్ జి.కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ర్యాన్‌గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్‌కు వచ్చారు. తన కారు టీఎస్ 09 ఈజెడ్ 1221ను ర్యాన్‌గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ముందు పార్కింగ్ చేసి ఓ షాపులోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. కారు స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతిని కనిపించాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీశారని తెలిపారు. సదరు షాపులో పనిచేసే ఉద్యోగి తన కారును ధ్వసం చేశాడని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. తాను స్టోర్ యజమానికి ఫిర్యాదు చేయగా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన షాపు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిన కోరారు. పోలీసులు ఆ స్టోర్ ఉద్యోగిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 324(4), 125, 351(2), రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments