Ad Code

టీ, కాఫీ తాగేవారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిక !


టీ, కాఫీ తాగేవారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త సూచనను జారీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దాని అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ఒక ప్రకటన విడుదల చేయబడింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది కాబట్టి ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఒక 150 ml కప్పు కాఫీలో 80-120 mg కెఫిన్ ఉంటుంది. ఇన్‌స్టంట్ కాఫీలో 50-65 mg కెఫిన్, టీలో 30-65 mg కెఫీన్ ఉంటుంది. రోజుకు 300 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదే విధంగా భోజనానికి ఒక గంట ముందు, తిన్న తర్వాత ఒక గంట వరకు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పానీయాలలో టానిన్లు ఉంటాయి. ఆహారంలో ఈ టానిన్ ల కారణంగా. ఐరన్ న్యూట్రీషియన్స్ శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీంతో రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో, నాన్-డైరీ టీ తాగడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని మెరుగుపరుస్తుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu