Ad Code

భారత్‌-ఎ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ !


స్ట్రేలియా పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన భారత్‌-ఎ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ అక్టోబరు 31న ప్రారంభం కానున్నది.  మహారాష్ట్ర ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌ను ఇండియా ఎ జట్టుకు కెప్టెన్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గత కొన్ని నెలలుగా భారత జట్టుకు ఎంపిక కాని యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు భారత్‌-ఎ జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రికీ భుయ్‌లు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్‌-ఎ జట్టులో చోటు దక్కించుకున్నారు. నితీశ్‌ రెడ్డి ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు రికీ భుయ్‌ రంజీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండో వికెట్ కీపర్‌గా అభిషేక్ పోరెల్‌ ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, నవదీప్ సైనీ లాంటి కుర్రాళ్లు జట్టులో ఉన్నారు. భారత్‌-ఎ జట్టు మాకే, మెల్‌బోర్న్‌లలో ఆస్ట్రేలియా-ఎతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడుతుంది. పెర్త్‌లో సీనియర్ భారత జట్టుతో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌ ఆడుతుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన నవంబరు 22న ఆరంభం అవుతుంది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్టులు జరగనున్నాయి. గతః రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలిచింది.

Post a Comment

0 Comments

Close Menu