కేరళలోని వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,653 ఓట్ల ఆధిక్యం పొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాకు 2,83,023 ఓట్లు పోలవగా, బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌కు 1,41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాహుల్ గాంధీ సాధించిన 3.65 లక్షల ఓట్ల రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంక గాంధీ 4 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించింది. వాయనాడ్ ఉపఎన్నికలో దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదుకాగా ఇది సాధారణ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం కంటే తక్కువే అయినా 4 లక్షలకుపైగా మెజార్టీని సాధించారు.
0 Comments