జ్ఞాపక శక్తిని పెంచడంలో బీట్ రూట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా నైట్రేట్స్ ఉంటాయి. ఈ బీట్ రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన ఏ సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే మెదడులోని కణాలను యాక్టివ్ చేసి జ్ఞాపక శక్తిని పెంచడంలో ఇది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రోకలీ మరియు క్యాప్సికం కూడా మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ సి మరియు విటమిన్ కే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కావున ఇవి బ్రెయిన్ యొక్క కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కాకుండా కూడా చూస్తుంది. అయితే మనం ప్రతిరోజు తీసుకోవలసిన ఆకుకూరలలో పాలకూర కూడా ఒకటి. ఈ పాలకూరను తిన్న లేక దీని రసం తాగిన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు పాలకూరను తీసుకుంటే చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనిలో విటమిన్ కే మరియు ఫోలేట్, ఐరన్ కూడా ఉంటాయి…
0 Comments