రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ బైక్ పేటెంట్ డిజైన్‌కు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటిని చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్లాసిక్ లుక్‌తో రానుందని అర్థమవుతోంది. ఈ వెహికల్‌ను మోడర్న్ టెక్నాలజీతో తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను 2024 నవంబర్ 4న అధికారికంగా పరిచయం చేయనుంది. లీకైన పేటెంట్ డిజైన్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లుక్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. డిజైన్ పరంగా ఇది రెట్రో బాబర్ స్టైల్, మోడర్న్ క్లాసిక్ లుక్ రెండింటినీ మిక్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎన్డీ టీవీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ బైక్‌లో ఫ్యూయల్ ట్యాంక్ ఉండదు. దాని స్థానంలో ఇతర వస్తువులు పెట్టుకునేందుకు స్థలం ఉంటుంది. బైక్ ముందు భాగంలోనే బ్యాటరీ, మోటార్‌ను కలిపి ఫిక్స్ చేశారు. ఈ బైక్‌లో చైన్‌కు బదులు బెల్ట్ ఉంటుంది. దాన్ని బ్యాక్ వీల్‌కు అటాచ్ చేస్తారు. పేటెంట్ ఇమేజ్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్-సీట్ డిజైన్‌తో కనిపించింది. అయితే శారీ గార్డు కూడా ఉంది కాబట్టి సెకండ్ సీటు కూడా దీనికి అమర్చుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త బైక్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానుంది. సాధారణంగా పెట్రోల్ బైకుల్లో చూడని ఒక రకమైన 'గిర్డర్ ఫోర్క్' అనే పార్ట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌లో కనిపిస్తోంది. గతంలో ఓల్డ్ బైక్స్‌లో ఇలాంటి ఫోర్క్ ఇచ్చేవారు. వెహికల్ వెనుక భాగంలో 'అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్' ఉంటుంది. దీంట్లో ఒక రకమైన 'మోనోషాక్' ఉంటుంది, కానీ అది కనిపించదు. అద్భుతమైన ఎజిలిటీ కోసం థిన్ టైర్స్ అందించారు. అయితే ఫైనల్ ఔట్‌పుట్ ఇలా ఉండకపోవచ్చు. కంపెనీ ఈ మోటార్ సైకిల్‌ను ఒక వీడియోలో టీజ్ చేసింది.
0 Comments