ఢిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 385గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వెల్లడించింది. గాలి నాణ్యతలను 'వెరీ పూర్' కేటగిరిగా సిపిసిబి వర్గీకరించింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, కల్కాజి, నెహ్రూ ప్లేస్, అక్షరధామ్ దేవాలయం వంటి ప్రాంతాల్లో పొంగమంచు కమ్మేసింది. గాలి నాణ్యతలు పడిపోవడంతో ఢిల్లీవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని సిపిసిబి హెచ్చరించింది.
0 Comments