హైదరాబాద్ లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫొటోను 'ఎక్స్'లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్‌ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు అక్టోబర్ 17న బిర్యానీ పెట్టారు. అయితే.. ఓ విద్యార్థికి వడ్డించిన బిర్యానీలో చికెన్ ముక్కతోపాటు కప్ప కూడా వచ్చింది. అది చూసి ఒక్కసారిగా విద్యార్థి షాక్‌కి గురయ్యాడు. చికెన్‌తో పాటే ఆ కప్పను కూడా మసాలాతో కలిపి ధమ్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. దీంతో సదరు విద్యార్థి మెస్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాంపస్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడుతున్నారు. కప్ప ఉన్న విషయాన్ని గుర్తించలేని నిర్వాహకులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఆరోగ్యాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బిర్యానీలో కప్ప ఉన్న ఫొటోను ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. అనంతరం తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు బయటపడుతుండటంతో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో బయటి ఆహారం తినాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇంట్లో వండుకుని తినే ఆహారం అన్ని విధాల శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
0 Comments