మహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి మరో జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్ జట్టు ఎలిమినేట్ అయ్యింది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్ ఇదివరకే ఎలిమినేట్ అయ్యింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. శోభన మోస్తరి (38), నిగార్ సుల్తానా (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్ కాప్, డెర్క్‌సెన్, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. తంజిమ్ బ్రిట్స్ (42) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అన్నెకె బోష్ (25) ఓ మోస్తరు పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహిమా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టగా.. రితే మోనీ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా అగ్రస్థానానికి (గ్రూప్-బి పాయింట్ల పట్టికలో) చేరుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
0 Comments