జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ బీఎండబ్ల్యూ మోటార్డ్ బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108 కి.మీ ప్రయాణిస్తుంది. కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లాక్ 2 రంగుల్లో ఈ బైక్ మార్కెట్ లో అందుబాటులో ఉండనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.5 లక్షలు. అధునాతన డిజైన్‌తో వచ్చిన ఈ బైక్ లో 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, USB-C ఛార్జింగ్ సాకెట్, రివర్స్ గేర్ వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. LED హెడ్‌లైట్ సెటప్, LED టైల్‌లైట్ ఎంతో అధునాతనంగా డిజైన్ చేశారు. ముందు భాగంలో USD ఫోర్క్, వెనుకవైపు సర్దుబాటు చేయగల మోనో-షాక్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.92 KWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జింగ్ చేస్తే 108 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 14.7 PS శక్తిని, 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుండి 50 కిమీ వేగాన్ని అందుకుంటుంది. డీఎంఈ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. ఇందులో ఎయిర్-కూల్డ్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది.
0 Comments