Ad Code

ఐటీ కంపెనీలు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ !


డాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్ద మొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉ‍ద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్‌ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్‌ 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్‌లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌, సంబంధిత సర్టిఫికేషన్‌లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది.


Post a Comment

0 Comments

Close Menu