అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు సరికొత్త జోష్ తీసుకొచ్చింది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 84 వేల మార్కు దాటగా.. నిఫ్టీ 25,800 మార్కు క్రాస్ చేసింది. అన్ని రంగాలు గ్రీన్‌లో కొనసాగాయి. దీంతో ఇన్వెస్టర్ల పంట పండింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,359 పాయింట్లు లాభపడి 84, 544 దగ్గర ముగియగా.. నిఫ్టీ 375 పాయింట్లు లాభపడి 25, 790 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.68 దగ్గర హైలెవల్‌లో ముగిసింది. నిఫ్టీలో ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ అత్యధికంగా లాభపడగా.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ మరియు బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, పవర్, టెలికాం, మెటల్, రియల్టీ 1-2 శాతంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.
0 Comments