కీబోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా ఏ ఓ చోటు ఉంటే బీ మరో చోట ఉంటుంది. ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి. కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y, U, I, O, P అనే లేటర్స్ ఉంటాయి. వాటిని కలిపేసి పలుకుతారు. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి రూపకల్పన చేశారట. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q, Z W, X, వంటి లెటర్స్ వాడకం తక్కువగా ఉంటుంది. ఈ అక్షరాలు పెద్దగా వాడము. కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటాము. అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటాము. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్ తాను రూపొందించిన టైపు మిషన్ కీబోర్డును 'Qwerty' నమూనాలో చేశాడట. మనం సాధారణంగా ఈ అక్షరాలనే వాడుతుంటాము. పైనున్న అక్షరాలు తక్కువ ఉపయోగపడుతుంటాయి. అదే ఒరవడి కంప్యూటర్ కీ బోర్డులకూ విస్తరించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం.. మరింత సులువైన 'కీ బోర్డు' అమరికలున్నట్లు రుజువు చేశారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు. ఈ కారణాలచేతనే కీ బోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా తయారు చేయడానికి గల కారణమని తెలుస్తోంది.
0 Comments