Ad Code

మరో అరుదైన మార్క్ క్రాస్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీ !


సెన్సెక్స్, నిఫ్టీ నేడు మరో అరుదైన మార్క్ క్రాస్ చేసి సంచలనం సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్ కనిపిస్తోంది. ఈ రోజు ఆసియా సూచీలు లాభాల బాటలో పయనించడంతో అదే మార్గంలో సెన్సెక్స్, నిఫ్టీ వెళ్లాయి. దేశీయ సూచీలు ఈ రోజు ఆరంభంలో కాస్త తడబాటుకు లోనైనప్పటికీ, ఆ తర్వాత క్రమంగా కోలుకుని కొత్త రికార్డు నమోదు చేశాయి. సెన్సెక్స్ 85 వేల పైన, నిఫ్టీ 26 వేలకు పైన క్లోజ్ కావడం విశేషం. మంగళవారం రోజు 84, 914 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్.. నేడు 84,836 వద్ద ప్రారంభమై ఆ తర్వాత 84, 743కి చేరుకుంది. ఆ తర్వాత లాభాల బాట పట్టి.. ఇంట్రాడే కనిష్టం నుంచి 500 పాయింట్లు ఎగబాకింది. చివరకు 255 పాయింట్ల లాభంతో 85,169 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా అదే బాటలో వెళుతూ 63.75 పాయింట్ల లాభంతో 26, 004 వద్ద ముగిసింది. తొలిసారిగా నిఫ్టీ 26వేల పాయింట్లను అధిగమించి జీవితకాల గరిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. నేటి ట్రేడింగ్ సెషన్ లో ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. ఎల్‌టీఐఎండ్‌ట్రీ, టాటా కన్స్యూమర్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu