Ad Code

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమ వర్షాలు !


ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. గాలి వీచే వేగం తగ్గిపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వాహన కాలుష్యం అధికం కావడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. నవంబర్ లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ''నవంబర్ 1 నుంచి 15 వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు యత్నిస్తున్నాం. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశాం. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం'' అని మంత్రి పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu