Ad Code

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్ సూచీలు !


అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలంగా కనిపించడంతో మంగళవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 85వేల మార్కును దాటగా, నిఫ్టీ తొలిసారి 26 వేల స్థాయిని దాటింది. సెన్సెక్స్ ఉదయం 84,860.7883 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొంత లాభాల్లోకి వచ్చినా రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,011.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 25,940.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా వుంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, మహింద్రా అండ్ మహింద్రా షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్, అల్ర్టాటెక్ సిమెంట్, కోటక్ మహింద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.

Post a Comment

0 Comments

Close Menu