Ad Code

లాభాల జోరులో దేశీయ స్టాక్ మార్కెట్‌ !


దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 81, 921 దగ్గర ముగియగా.. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25, 041 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర ముగిసింది. నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, భారతీ ఎయిర్‌టెల్, విప్రో మరియు హెచ్‌సిఎల్ టెక్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు టెలికాం మరియు మీడియా 2 శాతం చొప్పున పెరగగా.. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్‌కేర్, పవర్ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం లాభపడ్డాయి.

Post a Comment

0 Comments

Close Menu