బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడంతో 16 ఏళ్ల గరిష్ఠాల నుంచి 0.25 శాతం తగ్గించి 5 శాతానికి చేర్చింది. తగ్గింపు విషయంలో మానిటరీ పాలసీ కమిటీలో విధానకర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే 5-4 తేడాతో వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆమోదం లభించింది. కొవిడ్ ప్రారంభమైన 2020 మార్చి తర్వాత తొలిసారి వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే తొలిసారి. మున్ముందు వడ్డీ రేట్ల విషయంలో మానిటరీ పాలసీ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తుందని గవర్నర్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25- 5.50 శాతం వద్దే కొనసాగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరులో వడ్డీ రేట్ల కోత ఉంటుందని అమెరికా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్ల తగ్గింపు ప్రకటించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేటును నిన్న 0-0.1% నుంచి 0.25 శాతానికి పెంచింది.
0 Comments