Ad Code

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు !


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. కేసు గురించి మీడియా ముందు ప్రస్తావించ కూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. అలాగే సంబంధిత అధికారులకు కవిత పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu