బజాజ్ ఆటో చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్‌లో ఆగస్టు 2024లో ప్రత్యేకంగా రూ. 1,28,744 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)కు అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్‌లో ఎంబోస్డ్ డీకాల్స్, క్విల్టెడ్ సీట్లు ఉన్నాయి. ఆటో విభాగంలో ఉన్న ఏకైక మెటల్-బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఐపీ67 సర్టిఫికేషన్‌తో నీటి-నిరోధకతను కలిగి ఉండగా, 136కి.మీల ఏఆర్ఏఐ- వెరిఫైడ్ పరిధిని కలిగి ఉంది. చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్లూటూత్ కనెక్టివిటీ, చేతక్ యాప్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హజార్డ్ లైట్ వంటి ఫీచర్లతో వస్తుంది. “మా స్పెషల్ ఎడిషన్ చేతక్ ప్రత్యేక లాంచ్, ఆగస్ట్ సేల్‌తో అమెజాన్‌తో మా భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సంతోషిస్తున్నాం. ఈ సహకారం ఈవీ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇక్కడ వినియోగదారులు ప్రత్యేకంగా అమెజాన్‌లో సైలంట్ లగ్జరీని యాక్సెస్ చేయవచ్చు” అని ప్రెసిడెంట్, అర్బనైట్, బజాజ్ ఆటో ఎరిక్ వాస్ చెప్పారు. “ఎలక్ట్రిక్ చేతక్ దృఢమైన మెటల్ బాడీతో బజాజ్ ఆటో నుంచి మా కస్టమర్లు ఆశించిన విశ్వాసం, మన్నికను అందిస్తుంది. ఈ కొత్త ప్రత్యేక ఎడిషన్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, విలాసవంతమైన, విశ్వసనీయతతో కూడిన అసమానమైన రైడింగ్ అనుభవం, అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది” అన్నారాయన. చేతక్ ప్రీమియం, చేతక్ అర్బేన్/3202, చేతక్ 2901, చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సబ్సిడీకి ఆమోదం పొందాయని బజాజ్ ఆటో తెలిపింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లో భాగంగా ఉంది.
0 Comments