Ad Code

ఉల్లిపాయను తినడం పూర్తిగా మానేస్తే !


ల్లిపాయను ఒక నెల రోజులపాటు పూర్తిగా మానేసినట్లయితే మలబద్ధకం నుండి కంటిచూపు వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6 లాంటివి ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఈ ఫోల్లెట్ తో పాటు రొగరోధక వ్యవస్థ,కణాల పెరుగుదల, జర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే అల్లిసీన్, క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నియంత్రించడానికి మరియు దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒక నెలపాటు ఉల్లిపాయను గనుక తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. కానీ తప్పనిసరిగా చిన్న పాటి మార్పులు అయితే వస్తాయి అని అంటున్నారు నిపుణులు. ఈ ఉల్లిపాయలు ఎక్కువ మొత్తంలో డైటరీ, ఫైబర్ అనేది ఉంటుంది. ఇది ఆరోగ్యమైన జీర్ణవ్యవస్థకు ఎంతో ముఖ్యం. అందువలన వాటిని మానడం వలన అజీర్ణం తో పాటుగా మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి మాత్రమే కాక ఉల్లిపాయను తీసుకోకపోవడం వలన విటమిన్ సి, విటమిన్ b6, ఫోలేట్ లోపంతో పాటుగా మాంగనీస్, పొటాషియం, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలహీనంగా చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో అలసట అనేది పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు కూడా ఏర్పడతాయి. అంతేకాక రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu