Ad Code

ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ చీఫ్ రాజీనామా !


మెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీనికి సీక్రెట్ సర్వీస్ చీఫ్ బాధ్యత వహించింది. భద్రతా లోపానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2022 నుంచి సీక్రెట్ ఏజెన్సీకి చీటిల్ సారథ్యం వహిస్తున్నారు. ట్రంప్‌పై దాడి తర్వాత రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయన్నారు. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని నిరోధించే లక్ష్యంలో ఏజెన్సీ విఫలమైందని సోమవారం చీటిల్ అంగీకరించారు. మొత్తానికి ఒక రోజు తర్వాత సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ మంగళవారం రాజీనామా చేశారు. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైట్ హౌస్ అభ్యర్థి ట్రంప్‌పై 20 ఏళ్ల ముష్కరుడు గాయపరచడంతో చీటిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పని వారం క్రితమే చేసి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాల సీక్రెట్ సర్వీస్ కాలంలో ఈ ఘటన వైఫల్యం చెందిందని వెల్లడించారు. చీటిల్ 27 సంవత్సరాల పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశారు. 2021లో పెప్సికోకి ఉత్తర అమెరికాలో సెక్యూరిటీ హెడ్‌గా మారారు. అనంతరం 2022లో ప్రెసిడెంట్ జో బిడెన్ ఆమెను ఏజెన్సీకి అధిపతిగా నియమించారు.

Post a Comment

0 Comments

Close Menu