Ad Code

కల్కికి ఆరవ రోజు కూడా వసూళ్ల కుంభవృష్టి !


వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ రూపొందించిన కల్కి 2898 ఏడీ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ చిత్రం 6వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం తెలుగులో 11.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, హిందీలో 14 కోట్లు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు తిరగ రాసింది. తెలుగులో 200 కోట్ల రూపాయలు, తమిళంలో 21 కోట్ల రూపాయలు, హిందీలో 145 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ఆరో రోజు కూడా రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఆరవ రోజున ఇతర సినిమాలు సాధించిన వసూళ్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియా వైడ్ ఈ చిత్రం 28 కోట్ల రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేస్తుందని వెల్లడించారు. కల్కి చిత్రం గత ఐదు రోజుల్లో వసూళ్ల తుఫాన్‌ను మరిపించింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరవ రోజు కలెక్షన్లను కలిపితే ఈ మూవీ 670 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కలెక్షన్లు పెరిగితే ఈ చిత్రం 700 కోట్లకు సమీపంలో స్థిరపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0 Comments

Close Menu