లోక్‌సభ సమావేశాలు మంచి వేడి మీద జరుగుతున్నాయి. విపక్షాల ప్రసంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ సమావేశం మొదట్లోనే అసహనంగా కనిపించారు. స్పీకర్‌తో సహా అందరినీ ఆశ్చర్యపరిచేలా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ గంట 40 నిమిషాలు ప్రసంగించారు. ఈయన స్పీచ్ కరెక్టు కాదని స్పీకర్‌తో సహా అమిత్ షా కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన ముందు ఆందోళనలు చేస్తూ ఉన్న విపక్ష ఎంపీకి గ్లాసు నీళ్లు ఇచ్చారు. తన సిబ్బంది ద్వారా గ్లాస్‌తో నీళ్లు తెప్పించి విపక్ష ఎంపీ చేతికి ఇచ్చారు. దీంతో ఆ విపక్ష ఎంపీ షాక్ అయ్యారు. ఆ గ్లాసు నీళ్లు తీసుకోవడానికి విపక్ష ఎంపీ నిరాకరించినా ప్రధాని స్థాయి వ్యక్తి ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. మరి ఆ గ్లాసు నీళ్లు తాగారో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సభలో మోడీ ఎంపీల అలసటను గుర్తించి తనదైన శైలిలో సెటైరికల్‌గా గ్లాసుతో నీళ్లు తాగించారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజల సమస్యలను సభలో మాట్లాడి అధికార పక్షంతోనే నీళ్లు తాగించామని విపక్ష నేతలు అంటున్నారు.
0 Comments