జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో సోమవారం ఇన్‌చార్జీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పలువురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు జేఎంఎం ఎమ్మెల్యేలు వైద్యనాథ్ రామ్, బాబీ దేవి, మిథిలేష్ ఠాకూర్, దీపక్ బైరువా, హఫిజుల్ హసన్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, ఇర్ఫాన్ అన్సారీ, దీపక్ పాండే సింగ్.. ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ బోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరి 31వ తేదీన భూ కుంభకోణంలో.. మని లాండరింగ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఝార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కేసులో జూన్ 28న హేమంత్ సోరెన్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అదే రోజు జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. దీంతో సీఎం పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేశారు. ఆ క్రమంలో జులై 4న ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం స్వీకారం చేశారు. మరోవైపు ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. 81 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 45 మంది సోరెన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ పరీక్షల్లో నెగ్గడంతో.. అనంతరం కొన్ని గంటలకే సీఎం సోరెన్ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
0 Comments